NEWSANDHRA PRADESH

అర‌కు కాఫీని ప్ర‌మోట్ చేయాలి – సీఎం

Share it with your family & friends


ఆదివాసీ దినోత్స‌వం రోజున ప్ర‌క‌ట‌న

విజ‌య‌వాడ – అర‌కు కాఫీని ప్ర‌మోట్ చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. దేశంలోనే నెంబ‌ర్ వ‌న్ ప్రొడ‌క్ట్ గా ప్ర‌య‌త్నం చేయాల‌ని సూచించారు. ఆదివాసీ దినోత్స‌వం సంద‌ర్బంగా ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మంలో చంద్ర‌బాబు పాల్గొన్నారు. ఈ సంద‌ర్బంగా అర‌కు కాఫీ టేస్ట్ ను రుచి చూశారు.

గిరిజన ఉత్పత్తులకు, ముఖ్యంగా అరకు కాఫీకి జాతీయ, అంతర్జాతీయ డిమాండ్‌ను ఉపయోగించుకునే లక్ష్యంతో ముందుకు సాగాల‌న్నారు. గిరిజన ఉత్పత్తులకు పెరుగుతున్న డిమాండ్‌ను సద్వినియోగం చేసుకునేలా కృషి చేయాల‌న్నారు సీఎం.

అరకు కాఫీ విక్రయాలు, మార్కెటింగ్ వ్యూహాలపై ఆరా తీశారు. దీనివల్ల గిరిజనుల జీవనోపాధి గణనీయంగా మెరుగు పడుతుందని ఆయన పేర్కొన్నారు. గిరిజన ప్రాంతాల్లోని సార వంతమైన భూముల్లో వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని, తేనె, ఉద్యానవన పంటలు, కాఫీ సాగుకు సానుకూల ఫలితాలు వస్తాయని సీఎం నాయుడు నొక్కి చెప్పారు.