Saturday, April 19, 2025
HomeNEWSANDHRA PRADESHఏపీ ఆర్థిక ప‌రిస్థితి బాగో లేదు

ఏపీ ఆర్థిక ప‌రిస్థితి బాగో లేదు

సీఎం చంద్ర‌బాబు నాయుడు

అమ‌రావ‌తి – దివాళా అంచున ఏపీ రాష్ట్రం చేరుకుంద‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. నీతి ఆయోగ్ ఇచ్చిన రిపోర్టుపై స్పందించారు. ఆర్థిక ప‌రిస్థితి దారుణంగా ఉంద‌న్నారు. గ‌త జ‌గ‌న్ రెడ్డి స‌ర్కార్ అందినంత మేర అప్పులు చేసింద‌న్నారు. ప్ర‌భుత్వ కార్యాల‌యాల‌ను కూడా తాక‌ట్టు పెట్టార‌ని ఆవేద‌న చెందారు. గ‌త ఐదేళ్ల కాలంలో వ‌చ్చిన డ‌బ్బుల‌ను ఏం చేశారో ఎవ‌రికీ తెలియ‌ద‌న్నారు. తాము వ‌చ్చాక గాడిన పెట్టేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్నామ‌న్నారు. మొత్తంగా ప్ర‌జ‌లు అర్థం చేసుకోవాల‌ని సూచించారు.

సోమ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ఆర్థిక పరిస్థితి చూసి ఆ రాష్ట్ర పరిస్థితిని చెప్పొచ్చన్నారు. ఆర్థిక పరిస్థితి బాగా లేకపోతే అభివృద్ధి పనులు ముందుకు సాగవ‌ని స్ప‌ష్టం చేశారు చంద్ర‌బాబు నాయుడు. చివరికి బాధపడాల్సి వచ్చేది ప్రజలేనంటూ పేర్కొన్నారు.

అప్పులు చేస్తే తిరిగి చెల్లించే శక్తి మన రాష్ట్రానికి లేదన్నారు నారా చంద్ర‌బాబు నాయుడు. అభివృద్ధి పనులపై నిధులు ఎక్కువ ఖర్చు పెట్టాల్సి ఉంటుంద‌న్నారు.. అభివృద్ధి పనుల వల్లే రాష్ట్ర ఆదాయం పెరుగుతుందని చెప్పారు.

రాష్ట్రంలో వైసీపీ ఆర్థిక విధ్వంసం సృష్టించిందని ధ్వ‌జ‌మెత్తారు. ఇదే ఇప్పుడు భారంగా ప‌రిణ‌మించింద‌ని వాపోయారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments