NEWSANDHRA PRADESH

బెల్ట్ షాపులు పెడితే తోలు తీస్తా

Share it with your family & friends

సీఎం చంద్ర‌బాబు నాయుడు
అమ‌రావ‌తి – రాష్ట్రంలో ఎవ‌రైనా బెల్ట్ షాపులు పెడితే తాట తీస్తానంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు. త‌వ్వే కొద్దీ గ‌త ప్ర‌భుత్వం చేసిన పాపాలు కుప్ప‌లు తెప్ప‌లుగా బ‌య‌ట ప‌డుతున్నాయ‌ని ఆరోపించారు.

శ‌నివారం అధికారిక కార్య‌క్ర‌మంలో పాల్గొనేందుకు అనంత‌పురం జిల్లాలో ప‌ర్య‌టించారు సీఎం. అనంత‌పురం జిల్లా రాయ‌దుర్గంలో పాల్గొన్నారు. ఈ సంద‌ర్బంగా ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి ప్ర‌సంగించారు నారా చంద్ర‌బాబు నాయుడు.

రూ.10 ల‌క్ష‌ల కోట్లు అప్పులు చేశారంటూ గ‌త వైసీపీ ప్ర‌భుత్వంపై తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు. వీటికి వ‌డ్డీలు క‌ట్ట‌లేక ఇబ్బందులు ప‌డుతున్నామ‌ని అన్నారు సీఎం. మ‌ద్యం షాపుల విష‌యంలో నేత‌లు, దందాలు చేసే వారు మ‌ధ్య‌లో దూరితే వ‌దిలి పెట్ట‌నంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

పార్టీకి సంబంధించిన వారైనా లేదా ఇత‌రులు ఎవ‌రైనా స‌రే క్ర‌మ‌శిక్ష‌ణ‌తో మెల‌గాల‌ని స్ప‌ష్టం చేశారు సీఎం.