ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు
అమరావతి – సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. తన అరెస్ట్ కు సంబంధించి 60 దేశాల్లో నిరసనలు తెలిపారని అన్నారు. అయితే తెలంగాణలో నిరసన చేపట్టాలని చూస్తే ఆనాటి బీఆర్ఎస్ సర్కార్ అణదగొక్కేందుకు ప్రయత్నం చేసిందన్నారు. అందుకే ఫలితాన్ని అనుభవించిందన్నారు. ప్రజలు వాస్తవాలను పరిగణలోకి తీసుకున్నారని చెప్పారు. తనకు వ్యక్తులను విమర్శించాలని ఉండదన్నారు. వాళ్లు అవలంభించిన విధానాలు సరిగా లేవన్నారు.
శనివారం నారా చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడారు. తాజాగా బీఆర్ఎస్ పై, ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ పై చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. గులాబీ బాస్ సీఎంగా ఉన్న కాలంలో చంద్రబాబు నాయుడు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కమ్యూనిస్టులకు ఒకప్పుడు మంచి ఆదరణ ఉండేదన్నారు. కాలానికి తగ్గట్టు ఎవరైనా మారాలన్నారు సీఎం
ఇదిలా ఉండగా గత ఏడాదిలో జరిగిన శాసన సభ ఎన్నికల్లో అనూహ్యంగా తెలంగాణలో బీఆర్ఎస్ ఓటమి పాలైంది. ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్సీపీ పవర్ ను కోల్పోయింది. ఊహించని రీతిలో తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీలు కలిసి కూటమిగా ఏర్పడ్డాయి. భారీ మెజారిటీని సాధించింది. పవర్ లోకి వచ్చింది.