సోషల్ మీడియాపై కన్నేసి ఉంచండి
సీఎం చంద్రబాబు షాకింగ్ కామెంట్స్
అమరావతి – ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం జరిగిన సచివాలయంలో మంత్రివర్గం సమావేశం జరిగింది. ఈ సందర్బంగా దిశా నిర్దేశం చేశారు సీఎం. మంత్రివర్గ సమావేశం ముగిశాక రాజకీయ అంశాలపై చర్చించారు.
ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైసీపీ చేస్తున్న సోషల్ మీడియా ప్రచారం పైనా సుదీర్ఘ చర్చ జరిగింది. సర్కార్ ను కించ పరిచే పోస్టులపై ఉదాసీనత తగదంటూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లేవనెత్తారు.
అసభ్య, అవాస్తవ పోస్టులపై ఫిర్యాదులు వస్తున్నా కొందరు పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ ఆరోపించారు. ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకు వచ్చారు.
జగన్ ప్రభుత్వం లో క్రియాశీలకంగా వ్యవహరించిన కొందరు అధికారులే ఇప్పుడూ కీలక పదవుల్లో ఉన్నారనే అంశంపై ప్రధానంగా చర్చించారు . కొందరు అధికారుల తీరు వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోందని సీఎం దృష్టికి తీసుకెళ్లారు మంత్రులు.
పలు జిల్లాల ఎస్పీలు తమ ఫోన్ లకు సరిగా స్పందించడం లేదంటూ మంత్రులు వాపోయారు. కింద స్థాయిలో డీఎస్పీ, సీఐలపై నెపం నెట్టి తప్పుకుంటున్నారని ఆరోపించారు. తాను అందుకే తీవ్రంగా స్పందించాల్సి వచ్చిందని డిప్యూటీ సీఎం స్పష్టం చేసినట్టు సమాచారం.