వ్యవస్థలను గాడిన పెట్టేదాకా నిద్రపోను
స్పష్టం చేసిన నారా చంద్రబాబు నాయుడు
అమరావతి – ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిప్పులు చెరిగారు. ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం సీ ప్లేన్ ను ప్రారంభించారు. విజయవాడ ఘాట్ నుంచి శ్రీశైలం ఘాట్ వరకు సీ ప్లేన్ లోనే ప్రయాణం చేశారు. ఆయన వెంట కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రులు ఉన్నారు.
ఈ సందర్బంగా జరిగిన సభలో ప్రసంగించారు నారా చంద్రబాబు నాయుడు. తాను నాలుగోసారి సీఎం కావడం. కానీ గతంలో ఎలాంటి ఇబ్బందులు పడలేదని చెప్పారు. కానీ ఈసారి జరిగిన ఎన్నికల్లో మాత్రం తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొన్నానని తెలిపారు.
రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టాక తీవ్ర ఇబ్బందులు, సమస్యలు ఏర్పడ్డాయని పేర్కొన్నారు. తాను జీవితంలో ఇలాంటి వాటిని చూడలేదన్నారు. రాష్ట్రంలో అన్ని వ్యవస్థలను జగన్ రెడ్డి ధ్వంసం చేశాడని, మరికొన్నింటిని కావాలని నిర్వీర్యం చేశాడని సంచలన ఆరోపణలు చేశారు.
వాటిని చక్కదిద్దేందుకు నానా తంటాలు పడుతున్నానని చెప్పారు నారా చంద్రబాబు నాయుడు. ఇంకొకరైతే వీటిని తట్టుకోవడం కష్టమన్నారు ఏపీ సీఎం. కానీ తన అనుభవం తనకు ఉపయోగ పడిందని స్పష్టం చేశారు. ఇదే సమయంలో సంచలన ప్రకటన చేశారు చంద్రబాబు. గాడి తప్పిన వ్యవస్థలను గాడిలో పెట్టేదాకా తాను నిద్ర పోనంటూ హెచ్చరించారు.