NEWSANDHRA PRADESH

కోర్టులు..జ‌డ్జీల‌ను వ‌ద‌ల‌ని జ‌గ‌న్

Share it with your family & friends

నిప్పులు చెరిగిన సీఎం చంద్ర‌బాబు

అమ‌రావ‌తి – మాజీ సీఎం జ‌గ‌న్ రెడ్డిపై సీఎం చంద్ర‌బాబు నాయుడు నిప్పులు చెరిగారు. పోల‌వ‌రం ఎలా విధ్వంసానికి గురైందో ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జెంటేష‌న్ ద్వారా తెలియ చేశారు. ఈ సంద‌ర్బంగా సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు.

వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని ప్రజలు గుర్తించారని అన్నారు. ఫోర్త్ ఎస్టేట్ కూడా గత ప్రభుత్వానికి భయపడింద‌ని ఆవేద‌న చెందారు. కోర్టులను కూడా బ్లాక్ మెయిల్ చేసి జడ్జిలపై వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారని ఆరోపించారు.
\
రాష్ట్ర పునర్నిర్మాణం జరగడానికి మేమంతా కష్టపడి పని చేస్తాం. ప్రజలు గెలవాలి..రాష్ట్రం నిలవాలి అని ఎన్నికల ముందు ప్రచారం చేశాం. ప్రజలు గెలిచి…చారిత్రాత్మక తీర్పు ఇచ్చారు. ఇక రాష్ట్రాన్ని నిలబెట్టడంలో అందరూ భాగమైతే దానికి తాము బాధ్యత తీసుకుంటామ‌న్నారు.

ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వంలో దెబ్బతిన్న వాటిలో 7 ప్రధాన అంశాలపై శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ పెట్టే ముందు మన సమస్యలు కూడా కేంద్రం ముందు ఉంచాలన్నారు. అందుకే 25 రోజుల్లోనే 7 అంశాలపై శ్వేతపత్రాలు విడుదల చేసి తర్వాత రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెడతామ‌న్నారు.