జగన్ ఆ 36 హత్యల కథేంటో చెప్పు
నిప్పులు చెరిగిన చంద్రబాబు
అమరావతి – ఏపీ రాష్ట్రంలో మాటల యుద్దం ఇంకా కొనసాగుతూనే ఉంది. రాజకీయం మరింత రసవత్తరంగా మారింది. అధికార, ప్రతిపక్ష నాయకుల మధ్య నువ్వా నేనా అన్న రీతిలో డైలాగ్ వార్ ఊపందుకుంది.
అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి సర్కార్ దూకుడు పెంచింది. గతంలో 5 ఏళ్లు పాలించిన వైసీపీ జగన్ రెడ్డి హయాంలో జరిగిన అవకతవకలు, అక్రమాలు, అవినీతి బండారం బయట పెట్టేందుకు శ్రీకారం చుట్టారు సీఎం నారా చంద్రబాబు నాయుడు.
ఆయన ప్రతి రోజూ గత ప్రభుత్వంలో జరిగిన లోటు పాట్లు, చేసిన అప్పుల గురించి లెక్కల తో సహా శ్వేత పత్రాలను శాఖల వారీగా విడుదల చేస్తూ వస్తున్నారు. శుక్రవారం ఆర్థిక శాఖపై వైట్ పేపర్ రిలీజ్ చేశారు. ఏపీ అప్పు మొత్తం రూ. 10 లక్షల కోట్లు ఉందంటూ తేల్చేశారు.
ఇదిలా ఉండగా అసెంబ్లీ సాక్షిగా సీఎం చంద్రబాబు నాయుడు నిప్పులు చెరిగారు. జగన్ రెడ్డి బతుకంతా అబద్దాలతోనే గడిచిందన్నారు. ముందు నీ పాలనా కాలంలో జరిగిన 36 హత్యల గురించి చెప్పాలని డిమాండ్ చేశారు.