కక్ష సాధింపులకు తావు లేదు
సీఎం చంద్రబాబు నాయుడు
అమరావతి – ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు షాకింగ్ కామెంట్స్ చేశారు. మంగళవారం శాసన సభలో ప్రసంగించారు. ఈ సందర్బంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఏకి పారేశారు. రాష్ట్రాన్ని సర్వ నాశనం చేశాడని ఆరోపించారు. వ్యవస్థలను పక్కదారి పట్టించాడని వాపోయారు.
ఈ సందర్బంగా రాష్ట్రంలో కక్ష సాధింపులకు తావు లేదని స్పష్టం చేశారు. తమ పార్టీ నాయకులు, కూటమి నాయకులకు కూడా ఇదే చెప్తున్నానని హెచ్చరించారు నారా చంద్రబాబు నాయుడు. అదే సమయంలో తప్పు చేసిన వాళ్ళని వదిలే ప్రసక్తే ఉండదన్నారు.
శాంతి భద్రతల విషయంలో, నేరగాళ్లకు ఒకటే హెచ్చరిక చేస్తున్నా.. మొన్నటి వరకు మీ ఇష్టం వచ్చినట్టు చేశారని, ఇక నుంచి మీ ఆటలు సాగవని అన్నారు నారా చంద్రబాబు నాయుడు. ఇదిలా ఉండగా ఇవాళ కేంద్ర సర్కార్ ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో ఏపీకి ప్రయారిటీ ఇచ్చినందుకు కూటమి సర్కార్ తరపున ధన్యవాదాలు తెలియ చేసుకుంటున్నట్లు తెలిపారు.
రాష్ట్ర అవసరాలను గుర్తించి రాజధాని, పోలవరం, పారిశ్రామిక రంగాలపై దృష్టి సారించినందుకు ప్రధాని మోడీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు ప్రజల తరపున కృతజ్ఞతలు తెలిపారు సీఎం.
వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి కేంద్రం నుండి వచ్చే సహకారం ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణానికి చాలా ఉపయోగ పడుతుందన్నారు.