NEWSANDHRA PRADESH

నితిన్ గ‌డ్క‌రీకి బాబు థ్యాంక్స్

Share it with your family & friends

రూ. 252.42 కోట్లు మంజూరు

అమ‌రావ‌తి – ఏపీ రాష్ట్ర ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు కేంద్ర ప్ర‌భుత్వానికి కృత‌జ్క్ష‌తలు తెలిపారు. శుక్ర‌వారం ఎక్స్ వేదిక‌గా స్పందించారు. తాము కోరిన మేర‌కు స్పందించినందుకు, అడిగిన నిధుల‌ను మంజూరు చేసినందుకు, అంతే కాకుండా అమ‌రావ‌తికి 57 కిలోమీట‌ర్ల రైల్వే లైన్ నిర్మాణానికి ఆమోదం తెలిపినందుకు ధ‌న్య‌వాదాలు తెలిపారు.

ఇదే స‌మ‌యంలో ఏపీలో ర‌హ‌దారుల నిర్మాణానికి కేంద్ర ఉప‌రిత‌ల ర‌వాణా శాఖ మంత్రి నితిన్ గ‌డ్క‌రీ నిధులు మంజూరు చేయ‌డం ప‌ట్ల సంతోషం వ్య‌క్తం చేశారు నారా చంద్ర‌బాబు నాయుడు.

శ్రీకాకుళంలోని రణస్థలం వద్ద 6-లేన్ల ఎలివేటెడ్ కారిడార్‌ను అప్ గ్రేడేషన్ , అభివృద్ధి కోసం రూ. 252.42 కోట్లను మంజూరు చేయడం ప‌ట్ల ఆనందంగా ఉంద‌న్నారు సీఎం. దీంతో ఈ ప్రాంతం కనెక్టివిటీని గణనీయంగా పెంచుతుందన్న న‌మ్మ‌కాన్ని వ్య‌క్తం చేశారు.

ఇది పూర్త‌యితే ట్రాఫిక్ రద్దీని తగ్గిస్తుందన్నారు.. ఈ ప్రాజెక్ట్‌తో తాము కేవలం రోడ్లు వేయడమే కాదు, వేగవంతమైన వృద్ధికి, సున్నితమైన ప్రయాణానికి , ప్రకాశవంతమైన అవకాశాలకు మార్గం సుగమం అవుతుంద‌ని స్ప‌ష్టం చేశారు ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు.