మన్యం వీరుడికి సీఎం నివాళి
ఆయన లక్షలాది మందికి స్పూర్తి
అమరావతి – రాష్ట్ర వ్యాప్తంగా స్వాతంత్ర సమర యోధుడు , మన్యం వీరుడు అల్లూరి సీతా రామ రాజు జయంతి జూలై 4న గురువారం జరుపుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా ఏర్పాట్లు చేసింది. ఈ సందర్బంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు , డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ , మంత్రులు నారా లోకేష్ , కందుల దుర్గేష్ , పయ్యావుల కేశవ్ అల్లూరి సీతారామ రాజు చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్బంగా సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. అల్లూరి సీతారామ రాజు గొప్ప స్వాతంత్ర సమర యోధుడు అంటూ కితాబు ఇచ్చారు. మన్యం వీరుడి గురించి ఎంత చెప్పినా తక్కువేనని పేర్కొన్నారు.
అల్లూరి సీతారామ రాజు ఆనాటి బ్రిటీష్ దాష్టీకాలను ఎదుర్కొన్న ధీరుడు అంటూ కొనియాడారు. ఎందరో చేసిన బలిదానాలే ఇవాళ దేశానికి స్వేచ్ఛ లభించేలా చేసిందన్నారు నారా చంద్రబాబు నాయుడు.