బాధితులకు భరోసా చంద్రబాబు ఆసరా
వరద ప్రాంతాలలో సీఎం పర్యటన
విజయవాడ – రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో ఇబ్బంది పడుతున్న ప్రజలను రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు .
అందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని ప్రకటించారు. తక్షణ సహాయాన్ని అందించేందుకు మంత్రులు, ఉన్నతాధికారులు సంసిద్ధంగా ఉన్నారని తెలిపారు.
వరద ప్రాంతాల్లోని ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు సీఎం. బాధితుల కష్టాలు తెలుసుకునేందుకు విజయవాడ సింగ్ నగర్ లోని బుడమేరు వరద ప్రభావిత ప్రాంతంలో ముఖ్యమంత్రి పర్యటించారు.
అక్కడి నుంచి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వచ్చారు. సమస్య పరిష్కారం అయ్యే వరకు, ప్రతి ఒక్కరికీ సాయం అందే వరకు జిల్లా కలెక్టర్ ఆఫీస్ నే సీఎం కార్యాలయంగా చేసుకుని ఇక్కడ నుంచే పని చేస్తానని స్పష్టం చేశారు.
విజయవాడలో క్షేత్ర స్థాయిలో పర్యటించి, వరద పరిస్థితిని సమీక్షించారు. మొత్తం సమస్యలు అన్నీ యుద్ద ప్రాతిపదికన పరిష్కరిస్తానని భరోసా ఇచ్చారు చంద్రబాబు నాయుడు.
సీఎం వెంట కలెక్టరేట్ లోనే ఉన్నారు హోం శాఖ మంత్రి అనిత, ఎంపీ కేశినేని చిన్ని