వరద బాధితులకు బాబు భరోసా
ప్రభావిత ప్రాంతాలలో సీఎం పర్యటన
అమరావతి – ఎడ తెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలను సైతం లెక్క చేయకుండా పర్యటన చేపట్టారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. సోమవారం విజయవాడ కలెక్టరేట్ లో సమీక్ష చేపట్టారు. సహాయక చర్యల గురించి ఆరా తీశారు. మంత్రులను సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు.
కమాండ్ కంట్రోల్ సెంటర్ నుండి పర్యవేక్షించాలని సూచించారు మంత్రి నారా లోకేష్ కు. ఇదే సమయంలో సీఎస్, డీజీపీలతో ఆయా జిల్లాల కలెక్టర్లు , ఎస్పీలతో టెలి కాన్ఫరెన్స్ చేపట్టారు. సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
ఇదే సమయంలో రెండో రోజు కూడా చంద్రబాబు నాయుడు రంగంలోకి దిగారు. జల దిగ్బంధంలో చిక్కుకు పోయిన విజయవాడలోని పలు ప్రాంతాలలో పర్యటించారు.
యనమల కుదురు, పడమట ప్రాంతాల్లో పర్యటించారు సీఎం. రామలింగేశ్వర్ నగర్, జక్కంపూడి, భవానీ పురంలో బాధితులను పరామర్శించారు. బ్యారేజీ దిగువ లోతట్టు ప్రాంతాలు, ఎగువ ప్రాంతాల్లో నేరుగా బాధితుల వద్దకు వెళ్లి వారి కష్టాలు తెలుసుకున్నారు.
ముంపు నివారణ చర్యలను క్షేత్రస్థాయి నుంచే పర్యవేక్షించిన సీఎం ఒకవైపు వరద సహాయక చర్యలపై ఆరా తీశారు చంద్రబాబు నాయుడు.