సీఎం శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు
భగవానుడు రాష్ట్ర ప్రజలను ఆశీర్వదించాలి
అమరావతి – దేశ వ్యాప్తంగా శ్రీకృష్ణ జన్మాష్టమిని అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు. ఈ సందర్బంగా దేశ ప్రధాన మంత్రి నరేంద్ర దామోదర దాస్ మోడీతో పాటు ఆయా రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు ఎంకే స్టాలిన్, పినరయ్ విజయన్, సిద్దరామయ్య, అరవింద్ కేజ్రీవాల్, అనుముల రేవంత్ రెడ్డి, ఏక్ నాథ్ షిండే తదితరులు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
ఇదిలా ఉండగా శ్రీ కృష్ణ జన్మాష్టమి పర్వదినం సందర్భంగా ప్రజలకు కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలియ చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఆ శ్రీకృష్ణ భగవానుడు మీ కుటుంబాన్ని ఆనందంతో, ఆరోగ్యంతో, ఐశ్వర్యంతో ఆశీర్వదించాలని మనసారా కోరుకుంటున్నానని తెలిపారు.
గీతాసారంతో జీవిత సారం చెప్పిన శ్రీకృష్ణ పరమాత్ముడిని స్మరించు కోవడం అంటే మన కర్తవ్యాన్ని మనం గుర్తు చేసుకుని ముందుకు సాగడమేనని స్పష్టం చేశారు సీఎం. ఏ విషయంలో అయినా మనకు స్ఫూర్తినిచ్చే శ్రీ కృష్ణ తత్వాన్ని సరిగ్గా అర్ధం చేసుకుంటే ప్రతి అంశంలో మనం విజయం సాధించవచ్చు అని పేర్కొన్నారు నారా చంద్రబాబు నాయుడు. కృష్ణాష్టమి సందర్భంగా ఆ నీల మేఘ శ్యాముని కృపా, కటాక్షం రాష్ట్రంపై సదా ఉండాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.