Wednesday, April 23, 2025
HomeNEWSANDHRA PRADESHఫెంగ‌ల్ తుఫాన్ పై సీఎం స‌మీక్ష

ఫెంగ‌ల్ తుఫాన్ పై సీఎం స‌మీక్ష

అంద‌రూ అప్ర‌మ‌త్తంగా ఉండాలి

అమ‌రావ‌తి – బంగాళాఖాతంలో ఏర్ప‌డిన వాయుగుండం ఫెంగ‌ల్ తుఫానుగా మార‌డంతో ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు శ‌నివారం స‌మీక్ష చేప‌ట్టారు. అన్ని స్థాయిల‌లో ప్ర‌భుత్వ యంత్రాంగం ఉండాల‌ని ఆదేశించారు. రియ‌ల్ టైంలో అంచ‌నా వేసి చ‌ర్య‌లు చేప‌ట్టాల‌న్నారు.

ఆర్టీజీ ద్వారా నిరంత‌ర పర్య‌వేక్ష‌ణ చేయాల‌ని, రైతులు, మ‌త్స్య‌కారులు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని స్ప‌ష్టం చేశారు. జిల్లాల అధికారులు డిజాస్ట‌ర్ టీంను సిద్దంగా ఉంచు కోవాల‌ని ఆదేశించారు సీఎం. విపత్త నిర్వహణ శాఖ, జిల్లా కలెక్టర్లు, సీఎంఓ, రియల్ టైం గవర్నెన్స్ అధికారులతో మాట్లాడారు. అన్ని స్థాయిల్లో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలన్నారు.

ఆర్టీజీ ద్వారా నిరంతర పర్యవేక్షణతో ప్రజలను అప్రమత్తం చేయాలని ఆదేశించారు ముఖ్య‌మంత్రి• అన్ని స్థాయిల్లో వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసుకుని పూర్తి సమన్వయంతో పని చేయాలని సూచించారు. తుఫాన్ కారణంగా ఆకస్మిక వరదలు వస్తాయనే సమాచారం నేపథ్యంలో ఆయా జిల్లాల అధికారులు డిజాస్టర్ టీంను సిద్ధంగా ఉంచు కోవాల‌ని ఆదేశించారు చంద్ర‌బాబు నాయుడు.

ఆస్తి, ప్రాణ నష్ట నివారణకు ముందు నుంచే జాగ్రత్త చర్యలు తీసుకోవాలని స్ప‌ష్టం చేశారు. సహాయక చర్యలు, పునరావాస కార్యక్రమాలకు సమాయాత్తం కావాలని జిల్లాల క‌లెక్ట‌ర్ల‌ను ఆదేశించారు. తుఫాన్ పై ధాన్యం రైతులు ఆందోళనగా ఉన్నారని, నిర్ధిష్టమైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు అన్నదాతలకు చేర వేయాల‌ని అన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments