స్పష్టం చేసిన సీఎం చంద్రబాబు
అమరావతి – పర్యాటక రంగానికి ఏపీని కేరాఫ్ గా మారుస్తామన్నారు సీఎం చంద్రబాబు. గురువారం సచివాలయంలో పర్యాటక శాఖపై సమీక్ష చేపట్టారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధుల గురించి దృష్టి సారించాలన్నారు. త్వరలో తయారు చేసే బడ్జెట్ లో టూరిజం రంగానికి సంబంధించి ఎక్కువ నిధులు వచ్చేలా ప్లాన్ తయారు చేయాలని ఉన్నతాధికారులను ఆదేశించారు.
ఈ సమావేశంలో మంత్రి కందుల దుర్గేష్, ఎండీ ఆమ్రపాలి కాట, ఏపీ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ నూకసాని బాలాజీ, సీఎం కార్యదర్శి కార్తికేయ మిశ్రా, ఐఏఎస్, టూరిజం శాఖ సెక్రటరీ అజయ్ జైన్, ఐఏఎస్, ఆర్కియాలజీ డిపార్ట్ మెంట్ కమిషనర్ జి. వాణిమోహన్, ఐఏఎస్, ఆర్థిక శాఖ జాయింట్ సెక్రటరీ గౌతమ్ అల్లాడ, ఐఏఎస్ లు, ఈడీలు పద్మావతి, శేషగిరి, ఏపీ టూరిజం అథారిటీ సీఈవో శ్రీనివాస్ తదితరులు హాజరయ్యారు.
టూరిజంలో భాగంగా ఆలయాలను అభివృద్ది చేయాలని స్పష్టం చేశారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. పర్యారంగ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆహ్వానించాలని అన్నారు.