స్పష్టం చేసిన సీఎం చంద్రబాబు నాయుడు
అమరావతి – సమర్థ నాయకత్వం ఉంటేనే రాష్ట్రంలో అభివృద్ది సాధ్యమవుతుందని స్పష్టం చేశారు సీఎం చంద్రబాబు. మంగళవారం సచివాలయంలో మంత్రుల పనితీరుపై సమీక్ష చేపట్టారు. ఈ సందర్బంగా కీలక సూచనలు చేశారు. ఇప్పటికే పనితీరుపై ర్యాంకులను ఇవ్వడం జరిగిందన్నారు.
ఫైళ్ల క్లియరెన్స్ కు సంబంధించి ఎక్కువగా దృష్టి సారించాలని అన్నారు. లేకపోతే ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు. నిత్యం ఆయా శాఖలలో ఏం జరుగుతుందనే విషయంపై ఎప్పటికప్పుడు అప్ డేట్స్ తో ఉండాలని ఆదేశించారు సీఎం.
వివిధ శాఖలకు సంబంధించిన ఉన్నతాధికారులు పనుల ప్రగతికి సంబంధించి ఎప్పటికప్పుడు వివరాలు అందజేయాలని స్పష్టం చేశారు. ఎక్కడా అలసత్వం అన్నది పనికి రాదన్నారు. మెరుగైన ర్యాంకులు వచ్చిన మంత్రులను ప్రత్యేకంగా అభినందించారు చంద్రాబు నాయుడు. ఫైళ్ల పరిశీలనలో మరింత వేగం పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ఈ అంశాలకు సంబంధించి పూర్తిగా పట్టు కలిగి ఉండాలని మంత్రులు, కార్యదర్శులకు సూచించారు.