NEWSANDHRA PRADESH

కొండ‌చ‌రియ‌ల ఘ‌ట‌న‌పై సీఎం విచారం

Share it with your family & friends

ఒక్కో కుటుంబానికి రూ. 5 ల‌క్ష‌ల ప‌రిహారం

అమ‌రావ‌తి – ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు తీవ్ర విచారం వ్య‌క్తం చేశారు. కొండ చ‌రియ‌లు విరిగి ప‌డిన ఘ‌ట‌న‌లో న‌లుగురు మృతి చెంద‌డం ప‌ట్ల సంతాపం తెలిపారు. శ‌నివారం ఆయ‌న రాష్ట్రంలో కురుస్తున్న భారీ వ‌ర్షాల‌పై సమీక్ష చేప‌ట్టారు.

ఈ సంద‌ర్బంగా మృతి చెందిన వారి కుటుంబాల‌కు ఒక్కొక్క‌రికి రూ. 5 ల‌క్ష‌ల చొప్పున ప‌రిహారం ప్ర‌క‌టించారు. భారీ వర్షాల ధాటికి విజయవాడలోని మొగల్రాజపురంలో ఇళ్లపై కొండచరియలు విరిగిపడ్డాయి.

ఈ ఘటనలో నలుగురు మృతి చెందడం త‌న‌ను బాధ‌కు గురి చేసింద‌ని అన్నారు నారా చంద్ర‌బాబు నాయుడు. బండరాళ్లు విరిగి ఇళ్లపై పడిన ఘటనలో మేఘన, బోలెం లక్ష్మీ, లాలు, అన్నపూర్ణ అనే నలుగురు ప్రాణాలు కోల్పోయారు.

సహాయక చర్యలపై అధికారులతో సీఎం మాట్లాడారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

కొండచరియలు విరిగిపడే ప్రమాదం పొంచి ఉన్న చోట నుండి స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించే అంశంపై కసరత్తు చేయాలని అధికారులకు సీఎం సూచించారు. రెండు మూడు రోజులు భారీ వర్షాలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో అటు ప్రజలు, ఇటు అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.