సెమీ కండక్టర్ పాలసీపై సీఎం సమీక్ష
ఐటీ..డ్రోన్ టెక్నాలజీ వినియోగంపై ఆరా
అమరావతి – ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దూకుడు పెంచారు. ప్రధానంగా టెక్నాలజీ, లాజిస్టిక్, డ్రోన్ , తదితర అంశాలపై దృష్టి సారించారు. ఏపీలో భారీ ఎత్తున దేశం గర్వ పడేలా డ్రోన్ సమ్మిట్ ను నిర్వహించారు. బిగ్ సక్సెస్ చేశారు. మంగళవారం సచివాలయంలోని సీఎం ఛాంబర్ లో సమీక్ష చేపట్టారు.
ఇందులో ప్రధానంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సెమీ కండక్టర్ , డ్రోన్ కు సంబంధించిన పాలసీలపై ఆరా తీశారు నారా చంద్రబాబు నాయుడు. ఈ కీలక సమావేశంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి , ఉన్నతాధికారులు హాజరయ్యారు.
ప్రపంచ వ్యాప్తంగా మారుతున్న టెక్నాలజీని నిశితంగా పరిశీలించాలని స్పష్టం చేశారు. వినూత్నమైన విధానాలను రూపొందించాలని ఆదేశించారు ఏపీ సీఎం. దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆదర్శ ప్రాయంగా ఉండాలని స్పష్టం చేశారు.
కేంద్రం గర్వపడేలా, ఇతర రాష్ట్రాలు ఏపీని చూసి నేర్చుకునేలా తయారు చేయాలని, దీనిపై ఎక్కువగా ఫోకస్ పెట్టాలని అన్నారు నారా చంద్రబాబు నాయుడు.