ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు
అమరావతి – సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. మహిళా దినోత్సవం సందర్బంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా జరిగిన మీటింగ్ లో గతంలో ఆర్టీసీలో కండక్టర్లుగా మహిళలను పెట్టింది తానేనని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మహిళా స్వయం సహాయక సంఘాలను ఏర్పాటు చేసింది కూడా తానేనని అన్నారు. మహిళలకు షీ ఆటోలు కూడా ఇచ్చామన్నారు. ప్రస్తుతం ర్యాపిడోతో ఒప్పందం చేసుకుంటున్నట్లు చెప్పారు. వినూత్న ఆలోచనలతో ముందుకు వెళుతున్నామన్నారు. ఇవాళ మహిళా సాధికారత కోసం ఎంత ఖర్చు చేసేందుకైనా వెనుకాడబోమని ప్రకటించారు.
ప్రస్తుతం మహిళా సంఘాలు పూర్తిగా తమ కాళ్ల మీద తాము నిలబడేలా తయారైనట్లు తెలిపారు. ఇదంతా తన చలవ వల్లనే జరిగిందన్నారు నారా చంద్రబాబు నాయుడు. అన్ని ప్రభుత్వాలు స్వయం సహాయక సంఘాలు చేస్తున్న ప్రగతిని చూసి విస్తు పోతున్నారని తెలిపారు. ఎక్కడ భిన్నమైన, వినూత్నమైన, సమాజానికి పనికి వచ్చే ఆలోచలను తాము ప్రోత్సహిస్తామని చెప్పారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కుల వృత్తుల వారికి , మహిళలకు మేలు చేకూర్చేలా ఉపాధి కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు సీఎం.