NEWSANDHRA PRADESH

సంక్షేమం ప్ర‌భుత్వ ల‌క్ష్యం

Share it with your family & friends

సీఎం చంద్ర‌బాబు నాయుడు
అనంత‌పురం జిల్లా – అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల అభ్యున్న‌తి కోసం త‌మ ప్ర‌భుత్వం కృత నిశ్చ‌యంతో ఉంద‌ని స్ప‌ష్టం చేశారు సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. శ‌నివారం రాయ‌దుర్గం నియోజ‌క‌వ‌ర్గం నేమ‌క‌ల్లులో ఏర్పాటు చేసిన ప్ర‌జా వేదిక పేద‌ల సేవ‌లో కార్య‌క్ర‌మానికి హాజ‌రై ప్ర‌సంగించారు.

లాజిస్టిక్ , టెక్నాల‌జీ , నైపుణ్యాభివృద్ది , త‌దిత‌ర రంగాల‌పై తాము దృష్టి సారించామ‌ని చెప్పారు సీఎం. దేశంలోనే రాష్ట్రాన్ని రోల్ మోడ‌ల్ గా చేస్తామ‌న్నారు. అంత‌కు ముందు సీఎంకు సాద‌ర స్వాగ‌తం ప‌లికారు కాల్వ శ్రీ‌నివాసులు, ప‌య్యావుల కేశ‌వ్.

అంత‌కు ముందు నారా చంద్ర‌బాబు నాయుడు ఫెంగ‌ల్ తుఫానుపై స‌చివాల‌యంలో స‌మీక్ష చేప‌ట్టారు. ఈ సంద‌ర్బంగా ఆయా జిల్లాల క‌లెక్ట‌ర్లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని స్ప‌ష్టం చేశారు. డిజాస్ట‌ర్ మేనేజ్ మెంట్ (విప‌త్తుల నిర్వ‌హ‌ణ ) కు సంబంధించిన టీంల‌ను అల‌ర్ట్ గా ఉంచాల‌ని ఆదేశించారు. ఏ ఒక్క‌రికీ ఇబ్బంది లేకుండా చూడాల‌ని సూచించారు.