రౌడీలు..గూండాల ఆటలు సాగవు – సీఎం
ఆడబిడ్డల జోలికి వస్తే తాట తీస్తాం
అమరావతి – ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. శనివారం ఆయన శ్రీశైలం ఆలయాన్ని సందర్శించారు. పూజలు చేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కు ఎవరైనా భంగం కలిగించాలని చూస్తే తాట తీస్తామని హెచ్చరించారు.
ఇప్పటికే గాడి తప్పిన వ్యవస్థలను గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు నారా చంద్రబాబు నాయుడు. ప్రధానంగా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు.
సోషల్ మీడియాలో ఆడ బిడ్డల జోలికి వస్తే జాగ్రత్త అని అన్నారు. జగన్ కు తల్లి, చెల్లి అంటే గౌరవం లేదన్నారు నారా చంద్రబాబు నాయుడు . కానీ ఆయనకు లేక పోవచ్చు కానీ తమకు సభ్యత, సంస్కారం ఉన్నాయని అన్నారు సీఎం.
మృగాలను ఎలా నిలువరించాలో మాకు తెలుసు అని అన్నారు. నా దగ్గర రౌడీలు, గూండాల ఆటలు సాగవు అని వార్నింగ్ ఇచ్చారు. సోషల్ మీడియాలో ఇష్టానుసారం పోస్టులు పెడితే చర్యలు తప్పవని జాగ్రత్తగా ఉండాలని స్పష్టం చేశారు నారా చంద్రబాబు నాయుడు.
వ్యక్తిత్వ హననానికి పాల్పడితే వదిలి పెట్టమని అన్నారు. మర్యాదగా ఉంటే మార్యాదగా ఉంటాం. ఆడబిడ్డల జోలికి వస్తే ఊరుకునేది లేదన్నారు. రౌడీయిజం చేస్తే సహించేది లేదని స్పష్టం చేశారు.