లులు గ్రూప్ చైర్మన్ కు సీఎం థ్యాంక్స్
ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు రెడీ
అమరావతి – ప్రపంచ వ్యాప్తంగా వ్యాపార పరంగా పెద్ద ఎత్తున ఆదరణ పొందిన లులు సంస్థ ఏపీపై ఫోకస్ పెట్టింది. ఈ మేరకు లులు సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ యూసుఫ్ అలీ మర్యాద పూర్వకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలుసుకున్నారు. ఈ సందర్బంగా వీరిద్దరి మధ్య చర్చలు జరిగాయి. ఇవి ఫలప్రదం కావడం విశేషం.
రాష్ట్రంలో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు తాము సిద్దంగా ఉన్నామని ఈ సందర్బంగా ప్రకటించారు లులు గ్రూప్ సంస్థ చైర్మన్ , మేనేజింగ్ డైరెక్టర్ యూసుఫ్ అలీ. దాదాపు రూ. 3 వేల కోట్లకు పైగా ఇన్వెస్ట్ చేయనున్నట్లు హామీ ఇచ్చారు.
అరబ్ కంట్రీస్ తో పాటు హైదరాబాద్ లో కూడా లులు గ్రూప్ తన వ్యాపారాన్ని విస్తరించింది. యూసుఫ్ అలీతో కూడిన బృందం ప్రత్యేకంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు తమ వ్యాపార వ్యూహాలను, పెట్టుబడి అంచనాలను వివరించే ప్రయత్నం చేశారు.
ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో పెట్టుబడులతో పాటు వైజాగ్‌లో మాల్ , మల్టీప్లెక్స్, హైపర్ మార్కెట్, విజయవాడ , తిరుపతిలో మల్టీప్లెక్స్‌ల ఏర్పాటు చేసేందుకు ఓకే చెప్పారు యూసుఫ్ అలీ.
ఈ సందర్బంగా లులు గ్రూప్ సంస్థల చైర్మన్ కు ధన్యవాదాలు తెలిపారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు. తమ సర్కార్ అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందజేస్తామని హామీ ఇచ్చారు.