స్పష్టం చేసిన సీఎం చంద్రబాబు
అమరావతి – సీఎం చంద్రబాబు షాకింగ్ కామెంట్స్ చేశారు. నీటి పారుదల ప్రాజెక్టుల్లో అనుకున్న పనులు నిర్దేశించిన సమయానికి పూర్తి కావాల్సిందేనని హెచ్చరించారు. అన్ని అనుమతులు, నిధులు ఉన్న ప్రాజెక్టుల్లో జాప్యాన్ని సహించేది లేదన్నారు. 2027 జూన్ లక్ష్యంగానే పోలవరం పనులు జరగాలన్నారు. పోలవరం ఫలితాలు వచ్చేనాటికి ఉత్తరాంధ్ర సుజల స్రవంతి అదుబాటులోకి రావాలన్నారు. గ్రౌండ్ వాటర్ పెంపుపై ప్రణాళికకు నాలుగు శాఖల మంత్రులతో కమిటీని ఏర్పాటు చేశారు.
వెలుగొండ ప్రాజెక్టుపై ప్రత్యేక ఫోకస్ పెట్టాలన్నారు. తాను త్వరలోనే ప్రాజెక్టును సందర్శిస్తానని ప్రకటించచారు సీఎం. సచివాలయంలో జలవనరుల శాఖపై సమీక్ష చేపట్టారు. గత ప్రభుత్వం ఇరిగేషన్ రంగానికి తీరని ద్రోహం చేసిందన్నారు.
రైతులకు సాగునీరు అందించాలంటే..లక్ష్యాలను చేరుకునేలా వేగంగా పనులు జరగాలని అన్నారు. ముఖ్యంగా పోలవరం వంటి భారీ ప్రాజెక్టుల్లో ఈ రోజుకు ఎంత పని జరగాలి, ఈ నెలకు ఎంతపని జరగాలనేది లక్ష్యంగా పెట్టుకుని ఆ మేరకు పనులు పూర్తి అయ్యాయా లేదా అనేది సమీక్షించుకోవాలని సీఎం అన్నారు.