స్వర్ణాంధ్రప్రదేశ్ నా లక్ష్యం – సీఎం
స్పష్టం చేసిన చంద్రబాబు నాయుడు
అమరావతి – ఏపీని అన్ని రంగాలలో అభివృద్ది చేయడం, దేశంలోనే టాప్ లో నిలిచేలా చేయడం తన ముందున్న లక్ష్యమని స్పష్టం చేశారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు. వచ్చే 2047 నాటికి మన రాష్ట్రాన్ని స్వర్ణ ఆంధ్రప్రదేశ్‌గా మార్చాలనే దృక్పథంతో ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు. ఇందుకు సంబంధించి సీఎం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
ప్రభుత్వ అధికారులు, పరిశ్రమ మార్గదర్శకులు, వ్యక్తులతో సంప్రదింపుల ఆధారంగా తాము ఈ దృక్పథాన్ని ముందుకు నడపడానికి పది మార్గదర్శక సూత్రాలను అభివృద్ధి చేయడం జరిగిందని చెప్పారు .
ఇందులో భాగంగా పేదరిక నిర్మూలన, ఉపాధి కల్పన, నైపుణ్యం, మానవ వనరుల వినియోగం, నీటి భద్రత, అగ్రి టెక్ తో రైతుల సాధికారత, గ్లోబల్ బెస్ట్ లాజిస్టిక్స్, శక్తి, ఇంధన ధర ఆప్టిమైజేషన్, ఉత్పత్తి పరిపూర్ణత, స్వచ్ఛ ఆంధ్ర, లోతైన సాంకేతికత ను కల్పించే దిశగా ఈ విజన్ ఉంటుందని స్పష్టంచేశారు నారా చంద్రబాబు నాయుడు.
ఆంధ్రప్రదేశ్‌ను సంపన్న, ఆరోగ్యవంతమైన, సంతోషకరమైన రాష్ట్రంగా మార్చడానికి తాము కట్టుబడి ఉన్నామంటూ ప్రకటించారు.