రూ. 1941 కోట్లకు సర్కారు ఆస్తులు తాకట్టు
రూ. 40,000 కోట్ల భూములు జగన్ కబ్జా
అమరావతి – ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సీరియస్ కామెంట్స్ చేశారు. శనివారం శాసన సభ సాక్షిగా రాష్ట్రంలో గత వైసీపీ ప్రభుత్వం సాగించిన దారుణాలు, మోసాలు, కబ్జాల గురించి ఏకరువు పెట్టారు. అంకెలతో సహా వివరించే ప్రయత్నం చేశారు.
అధికారంలోకి వచ్చిన వెంటనే ఎలా మోసం చేయాలనే దానిపై ఫోకస్ పెట్టాడని, అందుకు అనుగుణంగా తాను దోచుకోవడం మొదలు పెట్టాడని ఆరోపించారు. జగన్ రెడ్డి ప్రవేశ పెట్టిన ప్రతి పథకం , కార్యక్రమం వెనుక అంతులేని , అంతు చిక్కని దోపిడీ దాగి ఉందని ధ్వజమెత్తారు నారా చంద్రబాబు నాయుడు.
అందుకే కూటమి సర్కార్ కొలువు తీరిన వెంటనే జగన్ బండారం మొత్తం బయట పెట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. విశాఖను రాజధానిని చేస్తానని ప్రకటించిన జగన్ ఏకంగా అక్కడ విలువైన ప్రభుత్వ ఆస్తులను రూ. 1941 కోట్లకు తాకట్టు పెట్టాడని చెప్పారు.
అంతే కాదు మరో రూ. 40,000 కోట్ల విలువైన భూములను జగన్ అండ్ కంపెనీ కబ్జా చేసిందని సంచలన ఆరోపణలు చేశారు నారా చంద్రబాబు నాయుడు. అన్నింటిపై విచారణ జరుపుతామని ప్రకటించారు ఏపీ సీఎం. ఏ ఒక్క పైసా విడిచి పెట్టే ప్రసక్తి లేదని వార్నింగ్ ఇచ్చారు.