సీఎం చంద్రబాబు నాయుడు
అమరావతి – ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని ఉద్దేశించి సీరియస్ అయ్యారు. తాను సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే జగన్ రెడ్డిని జైల్లో పెట్టేవాళ్లమని కానీ అలా చేయలేదన్నారు.
తనలా కక్ష పూరితంగా వ్యవహించం లేదన్నారు. సినిమా టికెట్ల ధరల పెంపు సమస్య కాదన్నారు. దానికంటే పెద్ద సమస్యలు చాలా ఉన్నాయని స్పష్టం చేశారు. త్వరలో ఆకస్మిక తనిఖీలు ఉంటాయన్నారు.
ఇచ్చిన ప్రతి హామీని ఒక్కటొక్కటిగా అమలు చేస్తూ వస్తున్నామని అన్నారు. త్వరలో ఆకస్మిక తనిఖీలు ఉంటాయని చెప్పారు. త్వరలోనే మహిళలకు తీపి కబురు చెపుతామన్నారు. మహిళలకు సంబంధించి ఇచ్చిన ఉచిత బస్సు ప్రయాణం త్వరలోనే అమలు చేసి తీరుతామన్నారు. ఇప్పటికే సబ్ కమిటీ ఏర్పాటు చేశామన్నారు సీఎం చంద్రబాబు నాయుడు.
ఆ కమిటీ నివేదిక ఇచ్చిన వెంటనే ఫ్రీ బస్ సర్వీస్ కల్పిస్తామన్నారు. మహిళల అభ్యున్నతే తమ లక్ష్యమని చెప్పారు.