పరిటాల సునీతకు పిలుపు
రావాలని సీఎంఓ నుంచి ఫోన్
అమరావతి – ఏపీలోని అనంతపురం జిల్లాకు చెందిన దివంగత పరిటాల రవీంద్ర సతీమణి, మాజీ మంత్రి ప్రస్తుత రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీతకు వెంటనే రావాలంటూ సీఎం చంద్రబాబు నాయుడు ఆఫీసు నుంచి ఫోన్ వచ్చింది.
వెంటనే సచివాలయానికి చేరుకోవాలని సూచించినట్లు సమాచారం. దీంతో పరిటాల సునీత ఆగ మేఘాల మీద అమరావతికి బయలు దేరింది. ఇదిలా ఉండగా అందరూ అనుకున్నట్లు ఈసారి జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ కూటమి భారీ విజయాన్ని సాధించింది.
గత సర్కార్ లో కీలకమైన మంత్రిత్వ శాఖను నిర్వహించారు పరిటాల సునీత. తాజాగా ప్రకటించిన మంత్రివర్గంలో ముందుగా సునీత పేరు ఉంటుందని అందరూ ఊహించారు. కానీ చంద్రబాబు నాయుడు , అమిత్ షా, జేపీ నడ్డా కలిసి తయారు చేసిన కేబినెట్ కూర్పులో ఆమెకు చోటు దక్కలేదు.
ఇక మంత్రివర్గంలో పయ్యావుల కేశవ్ కు చోటు దక్కింది. ఈ క్రమంలో పరిటాల సునీతకు కూడా మంత్రి పదవి ఇచ్చేందుకే బాబు రమ్మని కోరినట్లు ప్రచారం జరుగుతోంది.