వేడుకలకు దూరంగా ప్రజలకు దగ్గరగా
అమరావతి – ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు దూకుడు పెంచారు. దేశంలోనే అత్యంత సంపన్నమైన సీఎంగా టాప్ లో నిలిచారు. మరో వైపు సంపదను సృష్టించే పనిలో పడ్డారు. ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను ఆరు నూరైనా అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు. ఒక్క రోజులోనే ఆయన 2 వేల మందిని కలుసుకున్నారు. 1600 మందికి సీఎంఆర్ఎఫ్ నిధులు విడుదల చేశారు. స్వర్ణాంధ్ర విజన్ 2047 పై ఫోకస్ పెట్టాలన్నారు.
చంద్రబాబు నాయుడు న్యూ ఇయర్ వేడుకలకు దూరంగా ఉండడం విశేషం. ఆయనను టీటీడీ అర్చకులు ఆశీర్వచనం చేశారు. ప్రభుత్వానికి సంబంధించి కీలకమైన ఫైళ్లపై సంతకం చేశారు. నూతన సీఎస్ గా నియమితులైన కె . విజయ కుమార్ ప్రత్యేకంగా కలిశారు. ఈ సందర్బంగా కొంత సేపు చర్చించారు.
ఐఎఎస్,ఐపిఎస్ అధికారులు, వివిధ శాఖల అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలకు సమయం ఇచ్చారు.
అనంతరం దుర్గగుడిలో అమ్మ వారిని హోం శాఖ మంత్రి అనిత వంగలపూడితో కలిసి దర్శనం చేసుకున్నారు. అక్కడి నుంచి నేరుగా గవర్నర్ వద్దకు వెళ్లారు. ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. మీడియా ప్రతినిధులతో ముచ్చటించారు. వివిధ అంశాలపై వారికి బ్రీఫ్ చేశారు. ఈసారి ఏపీని ఇండియాలోనే టాప్ లో నిలబెడతానంటూ ప్రకటించారు.