సంతృప్తిని ఇచ్చిన పింఛన్ల పంపిణీ
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు
అమరావతి – ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో పెన్షన్ల పంపిణీ అద్భుతంగా జరిగిందని కొనియాడారు. ఈ సందర్బంగా రాష్ట్రంలో పెన్షన్లను పంపిణీ చేయడంలో కీలక పాత్ర పోషించిన ఉద్యోగులందరికీ పేరు పేరునా అభినందలు తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
కేవలం ఒకే ఒక్క రోజులో 97 శాతం పింఛన్ల పంపిణీ సంతృప్తిని ఇచ్చిందన్నారు నారా చంద్రబాబు నాయుడు. ఆగస్టు1వ తేదీనే ఇంటి వద్ద రూ. 2737 కోట్లతో 64 లక్షల మందికి పెంచిన పింఛన్ల పంపిణీ చేయడం జరిగిందని స్పష్టం చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక్క రోజులో రికార్డు స్థాయిలో 97.54 శాతం పింఛన్లు చేయలేదని పేర్కొన్నారు.
వృద్దులు, దివ్యాంగులు, ఇతర లబ్దిదారుల ఆర్థిక భద్రత తమ బాధ్యత అని స్పష్టం చేశారు. పెరిగిన పింఛన్లు పేదల బతుకులకు భరోసా కల్పించే ప్రయత్నం చేస్తోందని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు సర్కార్ లో భాగమని, అందుకే వారి సేవలను గుర్తు పెట్టుకుని ఒకటవ తేదీనే జీతాలు అందించేలా చేశామని వెల్లడించారు నారా చంద్రబాబు నాయుడు.
రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్ చెల్లించామని, ఆర్థిక ఇబ్బందులు ఉన్నా.. అనేక సమస్యలు ఉన్నా రూ. 5300 కోట్లు విడుదల చేసి వారికి దక్కాల్సిన జీతం 1తేదీనే చెల్లించామని చెప్పారు సీఎం.