శ్రీ సిటీ అద్భుతం ప్రగతి స్పూర్తి దాయకం
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు
తిరుపతి – ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రశంసలు కురిపించారు శ్రీ సిటీపై. సోమవారం ఆయన ప్రపంచంలోని పేరు పొందిన ప్రముఖ కంపెనీల ప్రతినిధులు, సీఈవోలు, మేనేజింగ్ డైరెక్టర్లతో భేటీ అయ్యారు. ఈ సందర్బంగా జరిగిన కీలక సమావేశంలో ప్రసంగించారు నారా చంద్రబాబు నాయుడు.
ఇవాళ అపారమైన అనుభవం కలిగిన సీఈవోలతో కలవడం, వారి అభిప్రాయాలను తెలుసు కోవడం, సూచనలు, సలహాలు అందుకోవడం సంతోషంగా ఉందన్నారు సీఎం. ఈ సందర్బంగా తనను అభినందించడం పట్ల ధన్యవాదాలు తెలిపారు.
ఇదే క్రమంలో గతంలో తాను ప్రాంరభించిన శ్రీ సిటీ ఇవాళ అద్భుతమైన ప్రగతిని సాధించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు నారా చంద్రబాబు నాయుడు. అయితే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుండి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పై దృష్టి సారించాలని అన్నారు.
గత ఐదేళ్లుగా వారు ఎదుర్కొన్న సవాళ్లను గో ఏపీ త్వరితగతిన పరిష్కరిస్తుందని హామీ ఇచ్చారు. ఈ సందర్బంగా శ్రీ సిటీ CEO లు, పరిశ్రమల వాటాదారులందరూ నిశ్చింతగా ఉండొచ్చని చెప్పారు. . స్వర్ణాంధ్ర ప్రదేశ్ 2047 కోసం తమ దార్శనికతకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్‌ను ప్రపంచ స్థాయి పెట్టుబడి గమ్యస్థానంగా మార్చడానికి మీరంతా సహకరించాలని పిలుపునిచ్చారు నారా చంద్రబాబు నాయుడు.