భూ కేటాయింపులపై పునః సమీక్షించాలి
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు
అమరావతి – ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆయన సమీక్ష చేపట్టారు. ఈ సందర్బంగా రాష్ట్ర రాజధాని అమరావతిని సంపద సృష్టి కేంద్రాలుగా మార్చే వారికి భూములు కేటాయించాలని స్పష్టం చేశారు.
గతంలో జరిగిన భూ కేటాయింపులపై పునః సమీక్ష చేయాల్సిన అవసరం ఉందన్నారు నారా చంద్రబాబు నాయుడు. పెట్టుబడులు పెట్టే సంస్థలకు భూ కేటాయింపులు జరపాలని సీఎం డిమాండ్ చేశారు. దేశంలోనే టాప్ 10 స్కూళ్లు, కాలేజీలు, ఆస్పత్రులు అమరావతిలో ఏర్పాటు కావాలని అన్నారు .
గతంలో గుర్తించిన 8,352 చదరపు కిలోమీటర్ల పరిధిలోనే రాజధాని ఉంటుందని స్పష్టం చేశారు ఏపీ సీఎం. ఇదిలా ఉండగా మంగళగిరి మున్సిపాలిటీలో కలిపిన గ్రామాలు పునరుద్ధరించాలని పేర్కొన్నారు . ఐఆర్ఆర్, నాలుగు లైన్లుగా కరకట్ట నిర్మాణం చేయాలని ఆదేశించారు నారా చంద్రబాబు నాయుడు. ఇదిలా ఉండగా గతంలో తమ ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు.
ఇదే సమయంలో రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులకు ప్రయోజనం చేకూర్చేలా తిరిగి మరో ఐదేళ్ల పాటు కౌలు పొడిగిస్తామని అన్నారు సీఎం.