Monday, April 21, 2025
HomeNEWSANDHRA PRADESHప్ర‌జ‌లంతా బాగుండాలి - జ‌గ‌న్

ప్ర‌జ‌లంతా బాగుండాలి – జ‌గ‌న్

క్రోధి నామ సంవ‌త్స‌ర శుభాకాంక్ష‌లు

అమార‌వ‌తి – ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు నూత‌న సంవ‌త్స‌ర శుభాకాంక్ష‌లు తెలిపారు. మంగ‌ళ‌వారం రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు వారి లోగిళ్ల‌లో ఉగాది ఉత్స‌వ శోభతో అల‌రారుతున్నాయి. ఈ సంద‌ర్బంగా శ్రీ క్రోధి నామ సంవ‌త్స‌రాన్ని పుర‌స్క‌రించుకుని ఏపీ సీఎం ఉగాది పండుగ వేళ ప్ర‌తి ఒక్క‌రు సుఖ శాంతుల‌తో, ఆయురారోగ్యాల‌తో, అష్టైశ్వ‌ర్యాల‌తో విల‌సిల్లాల‌ని ఆకాంక్షించారు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి.

అంతే కాకుండా రాష్ట్ర ప్రజలకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికి ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీ క్రోధి నామ సంవత్సరంలో రాష్ట్ర ప్రజలకు అన్నీ శుభాలు జరగాలని, విజయాలు సిద్ధించాలని, సమృద్ధిగా వానలు కురవాలని కోరారు.

పంటలు బాగా పండాలని, రైతులకు మేలు కలగాలని, సకల వృత్తుల వారు ఆనందంగా ఉండాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, పల్లెల్లో, పట్టణాల్లో ప్రతి ఇల్లూ కళకళ లాడాలని, మన సంస్కృతీ సంప్రదాయాలు కలకాలం వర్ధిల్లాలని ముఖ్యమంత్రి జ‌గ‌న్ రెడ్డి ఆకాంక్షించారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments