175 మంది వైసీపీ అభ్యర్థుల లిస్టు
ప్రకటించిన సీఎం జగన్ రెడ్డి
అమరావతి – రాష్ట్రంలోని 175 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి అభ్యర్థులను ప్రకటించారు ఏపీ సీఎం , వైసీపీ బాస్ జగన్ మోహన్ రెడ్డి. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్బంగా మంత్రి ధర్మాన ప్రసాదరావు జాబితాను ప్రకటించారు.
తుది జాబితాలో 32 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను పక్కన పెట్టారు. ఎక్కువ శాతం ప్రస్తుతం ఉన్న వారికే ప్రయారిటీ ఇచ్చారు . అయితే మరికొన్ని చోట్ల అభ్యర్థులను తారు మారు చేశారు జగన్ మోహన్ రెడ్డి. జాబితాను తయారు చేయడంలో మల్లగుల్లాలు పడ్డారు పార్టీ బాస్.
అసెంబ్లీ స్థానాలతో పాటు రాష్ట్రంలోని 25 ఎంపీ సీట్లకు ఖరారు చేశారు . వ చ్చే ఎన్నిక ల్లో సీట్ల పంపకంలో సోష ల్ ఇంజినీరింగ్ ప్రతిబింబించేలా ప్రయ త్నాలు మొద ల య్యాయి. రాబోయే ఎన్నికలకు అభ్యర్థులను ఎంపిక చేసే సమయంలో అధికార పార్టీ బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలకు సరైన ప్రాతినిధ్యాన్ని కల్పించింది.
ఇదిలా ఉండగా 2019 ఎన్నికల్లో అధికార పార్టీ వెనుకబడిన తరగతులకు చెందిన 48 మంది అభ్యర్థులను బరిలోకి దింపింది. ఇప్పుడు, పార్టీ 59 మంది అభ్యర్థులను ప్రకటించింది, ఇది 2024 ఎన్నికలకు 11 మంది పెరిగింది.