NEWSANDHRA PRADESH

ఆరు నూరైనా అభివృద్ది ఆగ‌దు

Share it with your family & friends

మ‌రోసారి వైసీపీకే జ‌నం ప‌ట్టం

పులివెందుల – ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఆరు నూరైనా అప్పులు ఎన్నైనా స‌రే అభివృద్ది చేయ‌డం ఆపే ప్ర‌స‌క్తి లేద‌న్నారు. పురోభివృద్దికి నిద‌ర్శ‌నం పులివెందుల ప‌ట్ట‌ణం అని పేర్కొన్నారు. పులివెందుల నియోజకవర్గ పరిధిలో రూ.861.84 కోట్లతో అభివృద్ధి చేసిన పలు నిర్మాణాలకు ప్రారంభోత్స‌వం చేశారు సీఎం. దేశంలో ఎక్క‌డా లేని రీతిలో సంక్షేమ ప‌థ‌కాల‌ను అమ‌లు చేస్తున్న ఘ‌న‌త త‌మ‌కే ద‌క్కుతుంద‌న్నారు.

ఇదిలా ఉండ‌గా రూ. 500 కోట్ల నాబార్డ్, ఆర్.ఐ.డి.ఎఫ్-37 నిధులు వెచ్చించి.. అధునాతన వసతులతో నూతనంగా నిర్మనించిన డా. వైఎస్ఆర్ గవర్నమెంట్ మెడికల్ కళాశాల, గవర్నమెంట్ జెనరల్ హాస్పిటల్ (జిజిహెచ్) భవనాలను ప్రారంభించారు.

ఇందులో ప్రతి ఏడాది 150 మంది వైద్య విద్యార్థుల అడ్మిషన్ తో మొత్తం 750 మంది విద్యార్థులు, 627 పడకల కేపాసిటీతో టీచింగ్ హాస్పిటల్, మెడికల్ కళాశాల, నర్సింగ్ కళాశాల, బాయ్స్, గర్ల్స్ హాస్టల్ భవనాలను ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు జ‌గ‌న్ రెడ్డి.

పులివెందుల మైన్స్ సమీపంలో బనానా ప్రాసెసింగ్ యూనిట్ వద్ద రూ. 20.15 కోట్ల ఖ‌ర్చుతో ఇంటిగ్రేటెడ్ బనానా ప్యాక్ హౌస్ ను ప్రారంభించారు. ఇందులో 600 మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యమున్న నాలుగు కోల్డ్ రూములు, 126 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో ఆరు ప్రీ కూలింగ్ ఛాంబర్లు, లేబర్ క్వార్టర్స్, మిషనరీ రూమ్స్, 60 మెట్రిక్ టన్నుల వేయింగ్ బ్రిడ్జితో పాటు.. బనానా, స్వీట్ లైం కు సంబంధించి వేర్వేరుగా నాలుగు గ్రేడింగ్, క్లినింగ్, ప్యాకింగ్ లైన్స్ ఏర్పాటు చేయడం జరిగింది.

2.79 ఎకరాల్లో రూ.38.15 కోట్ల ఖ‌ర్చుతో అత్యాధునిక హంగులతో నిర్మించిన డా.వైఎస్ఆర్ మినీ సెక్రెటేరియేట్ కాంప్లెక్స్ భవనాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఇందులో గ్రౌండ్ ఫ్లోర్ లో ఆర్డీవో, స్పందన హాల్, అగ్రికల్చర్, పే అండ్ అకౌంట్స్, సబ్ ట్రెజరీ, 3.కాన్ఫరెన్స్ హాళ్లు, రెండు టాయిలెట్ బ్లాక్స్ ఏర్పాటు చేశారు. ఫస్ట్ ఫ్లోర్ లో పాడా ఆఫీస్, పీఆర్, ఆర్డబ్ల్యుఎస్ ఇంజనీరింగ్ కార్యాలయాలు, సీడీపీవో కార్యాలయం, రెండు కాన్ఫరెన్స్ హాళ్లు, రెండు టాయిలెట్ బ్లాకులు ఉన్నాయి.