ముగిసిన జగన్ విదేశీ పర్యటన
బెజవాడకు చేరుకున్న ఏపీ సీఎం
విజయవాడ – విదేశీ పర్యటన ముగించుకుని విజయవాడకు చేరుకున్నారు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి. గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న సీఎంకు సీనియర్ నాయకులు పెద్ద ఎత్తున సాదర స్వాగతం పలికారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వైఎస్సార్ పార్టీకి చెందిన నాయకులు.
విదేశీ పర్యటన ముగించుకుని కుటుంబ సమేతంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఇవాళ విజయవాడ చేరుకున్నారు. ఈ సందర్భంగా జగన్‌కు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నాయకులు, శ్రేణులు ఘనస్వాగతం పలికారు. అనంతరం విమానాశ్రయం నుంచి సీఎం వైయస్.జగన్ నేరుగా తాడేపల్లిలోని ముఖ్యమంత్రి నివాసానికి చేరుకున్నారు.
జూన్ 4న రాష్ట్రానికి సంబంధించి శాసన సభ, లోక్ సభ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఇందుకు సంబంధించి పార్టీ శ్రేణులకు సీఎం దిశా నిర్దేశం చేయనున్నారు ఏపీ సీఎం. మరోసారి పవర్ లోకి రానున్నట్లు ప్రకటించారు . ముందస్తు ప్రమాణ స్వీకారం కోసం ముహూర్తం కూడా ఖరారు చేశారు.