కూటమి పరాజయం ఖాయం
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి
అనకాపల్లి – తెలుగుదేశం పార్టీ కూటమికి అంత సీన్ లేదన్నారు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి. వై నాట్ 175 అన్న నినాదం పైనే తాను కట్టుబడి ఉన్నానని చెప్పారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా అనకాపల్లిలో పర్యటించారు. ఈ సందర్భంగా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన రోడ్ షోకు భారీ ఎత్తున జనం హాజరయ్యారు.
మోసానికి చిరునామా చంద్రబాబు నాయుడు అని ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ సినిమాలకు మించిన నటుడంటూ మండిపడ్డారు. ఇక రాష్ట్రంలో బీజేపీ ఉందో లేదో కూడా తెలియని పరిస్థితి నెలకొందన్నారు జగన్ రెడ్డి.
ప్రజలు అభివృద్దిని, సంక్షేమాన్ని కోరుకుంటారని కానీ విధ్వంసాన్ని, మోసాలను ఎట్టి పరిస్థితుల్లో తట్టు కోలేరని చెప్పారు ఏపీ సీఎం. ఆరు నూరైనా తాము గెలుపొందడం పక్కా అని తేల్చి చెప్పారు . ఏపీని గతంలో ఏలిన చంద్రబాబు నాయుడు ఏం చేశారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన ఘనత ఆయనదేనంటూ మండిపడ్డారు.