వైసీపీ ఎంపీ..ఎమ్మెల్యేల ప్రకటన
ఏపీ సీఎం సంచలన నిర్ణయం
అమరావతి – ఏపీ వైసీపీలో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. రాష్ట్రంలో శాసన సభ , సార్వత్రిక ఎన్నికల వేడి రాజుకుంది. దీంతో వై నాట్ 175 అనే నినాదంతో ముందుకు వెళుతున్నారు జగన్ మోహన్ రెడ్డి. ఇందులో భాగంగా చాలా మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలకు స్థాన చలనం కలిగింది. పలువురిని ఎంపీలుగా మరికొందరిని ఎమ్మెల్యే అభ్యర్థులుగా మార్పులు చేశారు. దీంతో కొంత గందరగోళ పరిస్థితి నెలకొంది.
ఏది ఏమైనా పని తీరు ఆధారంగానే టికెట్లను కేటాయించడం జరుగుతుందని ఇప్పటికే పలు మార్లు జరిగిన పార్టీ ముఖ్య సమావేశంలో ప్రకటించారు. ఒకవేళ తీరు మార్చు కోక పోతే చర్యలు తప్పవంటూ హెచ్చరించారు.
తాజాగా కొత్తగా ఎంపీ, ఎమ్మెల్యేల అభ్యర్థులను ఖరారు చేశారు. ఈ మేరకు పార్టీ హైకమాండ్ కీలక ప్రకటన చేసింది. విచిత్రంగా ఒంగోలు ఎంపీ సీటుకు తిరుపతికి చెందిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని కేటాయించారు. ఇది విస్తు పోయేలా చేసింది. ఇందులో భాగంగా మొత్తం నాలుగు ఎంపీ, 3 అసెంబ్లీ స్థానాలలో మార్పులు చేశారు.
కాకినాడ ఎంపీగా చలమల శెట్టి సునీల్, నర్సారావు పేట ఎంపీగా అనిల్ కుమార్ యాదవ్ , తిరుపతి ఎంపీగా గురుమూర్తిని ప్రకటించారు. ఇక మచిలీపట్నం ఎంపీగా సింహాద్రి రమేష్ బాబు, సత్యవేడు శాసన సభ నియోజకవర్గానికి నూకతోటి రాజేశ్, అరకు వేలి ఎమ్మెల్యేగా రేగం మత్స్య లింగం, అవనిగడ్డ కు డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ రావును ఎంపిక చేశారు.