నన్ను విదేశాలకు వెళ్లనీయండి
అనుమతి కోరిన సీఎం జగన్ రెడ్డి
అమరావతి – వైసీపీ బాస్ , ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ ఎన్నికల వేళ తన సోదరి వైఎస్ షర్మిల సంచలన కామెంట్స్ చేసింది. జగన్ రెడ్డి ఓడి పోతున్నాడని, ఆయనను విదేశాలకు వెళ్లకుండా నిలిపి వేయాలని డిమాండ్ చేయడం కలకలం రేపింది.
ఇదిలా ఉండగా విదేశాలకు వెళ్లేందుకు తనకు సీబీఐ కోర్టు అనుమతి ఇవ్వాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది. ఏపీలో మే 13న రాష్ట్రంలో శాసన సభ, లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి. 17 నుంచి ఫ్రాన్స్ స్విట్జర్లాండ్ , యునైటెడ్ కింగ్ డమ్ వెళ్లేందుకు పర్మిషన్ ఇవ్వాలని కోరారు.
అయితే ముందస్తు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్ల కూడదని జగన్ మోహన్ రెడ్డిని ఇప్పటికే సీబీఐ కోర్టు హుకూం జారీ చేసింది. ఇందుకు సంబంధించి కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐని న్యాయ స్థానం కోరింది.
ప్రస్తుతం స్వంత సోదరి, ఏపీ పీసీసీ చీఫ్ గా ఉన్న వైఎస్ షర్మిల ప్రత్యక్షంగా మాటల దాడులు చేయడం చర్చనీయాంశంగా మారింది.