గన్నవరం జనసంద్రం
జగన్ కోసం తరలి వచ్చిన జనం
కృష్ణా జిల్లా – ఏపీలో రాజకీయాలు వేడెక్కాయి. ఒకరిపై మరొకరు మాటల తూటాలు పేలుతున్నాయి. ప్రస్తుతం జరగబోయే శాసన సభ, పార్లమెంట్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు వైసీపీ బాస్ , ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి. ఆయనపై విజయవాడలో మేమంతా సిద్దం బస్సు యాత్ర లో పాల్గొన్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తి ఒకరు రాయితో దాడి చేశారు. నుదుటిపై గాయమైంది. ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం కోలుకున్న జగన్ రెడ్డి తిరిగి ప్రచారాన్ని ప్రారంభించారు.
ఇదిలా ఉండగా ఎన్నికల ప్రచారంలో భాగంగా కృష్ణా జిల్లా గన్నవరంలో వైసీపీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున రోడ్ షో చేపట్టింది. ఎక్కడ చూసినా జనం తండోప తండాలుగా తరలి వచ్చారు. తమ అభిమాన నాయకుడిని చూసేందుకు రావడంతో వైసీపీ సీనియర్లు తెగ సంతోషానికి లోనవుతున్నారు.
ప్రస్తుతం జగన్ రెడ్డి వర్సెస్ టీడీపీ కూటమి, కాంగ్రెస్ పార్టీలతో పోటీ పడుతున్నారు. ఈ సందర్బంగా అశేష జన సంద్రాన్ని ఉద్దేశించి అభివాదం చేశారు జగన్ రెడ్డి. దేశంలో ఎక్కడా లేని రీతిలో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని చెప్పారు. అన్ని వర్గాల ప్రజలకు మేలు చేకూర్చేలా చేశానని, మరోసారి ఛాన్స్ ఇవ్వాలని కోరారు సీఎం.