అధికార వికేంద్రణపై ఫోకస్
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి
అమరావతి – ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీ కూటమి అంచనాలు వర్కవుట్ కావని పేర్కొన్నారు. జనం స్వతంత్రంగా తమ ఓటు హక్కు వినియోగించు కున్నారని , ఇది ప్రజాస్వామ్యానికి, ప్రగతికి సంకేతమని అన్నారు.
ఇదే సమయంలో తనను పదే పదే రాజధాని విషయంలో విమర్శిస్తూ వస్తున్న ప్రతిపక్షాల నేతలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు జగన్ మోహన్ రెడ్డి. తాను కేవలం అభివృద్దిపై ఫోకస్ పెట్టానని అన్నారు. గతంలో చంద్రబాబు నాయుడు తన చేతికి చిల్లి గవ్వ ఇవ్వలేదని అన్నారు. లక్ష కోట్ల అప్పులు చేసి తమ మీద రుద్దే ప్రయత్నం చేశారని ఆరోపించారు.
గాడి తప్పిన ఏపీ ఆర్థిక రంగానికి చికిత్స చేసేందుకు చాలా సమయం పట్టిందన్నారు. అభివృద్దికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకున్నామని చెప్పారు సీఎం జగన్ రెడ్డి. తాను మొదటి నుంచీ అధికార వికేంద్రీకరణకు కట్టుబడి ఉన్నానని అన్నారు. 13 జిల్లాలకు గాను 26 జిల్లాలకు పెంచామని చెప్పారు సీఎం.
మూడు రాజధానులు పూర్తవుతాయని, ప్రధాన రాజధాని విశాఖను కేంద్రంగా తయారు చేస్తున్నట్లు స్పష్టం చేశారు .