NEWSANDHRA PRADESH

మ‌హిళా సాధికార‌త‌కు పెద్ద‌పీట

Share it with your family & friends

స్ప‌ష్టం చేసిన సీఎం జ‌గ‌న్ రెడ్డి

అమ‌రావ‌తి – త‌మ ప్ర‌భుత్వం మ‌హిళా సాధికార‌త‌కు పెద్దపీట వేసింద‌ని చెప్పారు ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి. మహిళా సాధికారత అనేది కేవలం సామాజిక న్యాయానికి సంబంధించిన అంశం మాత్రమే కాదన్నారు. ఇది ఆర్థిక అనివార్యం కూడా అని స్ప‌ష్టం చేశారు. ఈ సూత్రాన్ని బలంగా త‌మ ప్ర‌భుత్వం న‌మ్మింద‌ని అన్నారు జ‌గ‌న్ రెడ్డి. ఇందుకు సంబంధించి ఆచ‌ర‌ణ‌లో చేసి చూపించింద‌న్నారు.

ఈ విధానం వ‌ల్ల ఆర్థికంగా వెనుక‌బ‌డిన వ‌ర్గాలు అక్కా చెల్లెమ్మ‌ల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ఆస్కారం క‌లిగింద‌న్నారు సీఎం. రాష్ట్ర వ్యాప్తంగా రెడ్డి, కమ్మ, ఆర్య వైశ్య, బ్రాహ్మణ, క్షత్రియ, వెలమలతో పాటు ఇతర ఓసీ సామాజిక వర్గాలకు చెందిన అర్హులైన 4,19,583 మంది పేద మ‌హిళ‌ల‌కు రూ. 629.37 కోట్ల ఆర్థిక సాయాన్ని అంద‌జేశారు.

ఇందులో భాగంగా నంద్యాల జిల్లా బ‌న‌గాన‌ప‌ల్లెలో బుధ‌వారం సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి బ‌ట‌న్ నొక్కి నేరుగా వారి ఖాతాల్లో జ‌మ చేశారు. 45 నుండి 60 ఏళ్ల లోపు ఉన్న రెడ్డి, కమ్మ, ఆర్య వైశ్య, బ్రాహ్మణ, క్షత్రియ, వెలమ లతో పాటు ఇతర ఓసీ వర్గాలకు చెందిన పేద‌ల‌కు రూ. 15,000 చొప్పున 3 ఏళ్ల‌లో రూ. 45,000 ఆర్థిక సాయం చేస్తూ వ‌స్తోంద‌ని చెప్పారు.