NEWSANDHRA PRADESH

పారిశ్రామిక రంగంలో ఏపీ ముంద‌డుగు

Share it with your family & friends

ప‌లు అభివృద్ది ప‌నుల‌కు శ్రీ‌కారం

అమ‌రావ‌తి – పారిశ్రామిక రంగంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం కీల‌క‌మైన అడుగు వేయ‌నుంది. సీఎం క్యాంపు కార్యాల‌యం నుంచి ప‌లు ప‌రిశ్ర‌మ‌ల‌కు వ‌ర్చువ‌ల్ ద్వారా శంకు స్థాప‌న‌లు, ప్రారంభోత్స‌వాలు చేయ‌నున్నారు ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి.

పలు పరిశ్రమలకు శంకుస్ధాపనలు, ఆగ్రో ప్రాసెసింగ్‌ యూనిట్లను సీఎం ప్రారంభించ‌నున్నారు. సుమారు రూ. 4,178 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేయబోయే పలు పరిశ్రమలకు భూమి పూజ నిర్వహించనున్నారు, ఇవి కాకుండా రూ. 655 కోట్లతో ఏర్పాటు చేసిన ఆగ్రో ప్రాసెసింగ్‌ యూనిట్లను కూడా ప్రారంభిస్తారు. మొత్తంగా సుమారు రూ. 4,833 కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి రానున్నాయి.

బిర్లా గ్రూప్, రిలయెన్స్‌ ఎనర్జీ, హెల్లా ఇన్‌ఫ్రా, వెసువియస్‌ ఇండియా లిమిటెడ్, ఏపీఐఐసీ, ఏపీ ఎంఎస్‌ఎంఈ కార్పొరేషన్, అన ఒలియో ప్రైవేట్‌ లిమిటెడ్‌కు చెందిన పలు ప్రాజెక్ట్‌లకు మోక్షం ల‌భించ‌నుంది.

రాబోయే రోజుల్లో ఏపీ వైపు ప‌లు కంపెనీలు రానున్నాయ‌ని ఈ సంద‌ర్బంగా ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి వెల్ల‌డించారు. ప్ర‌భుత్వ ప‌రంగా స‌హాయ స‌హ‌కారాలు అంద‌జేస్తామ‌న్నారు.