గీతాంజలి కుటుంబానికి జగన్ ఆసరా
రూ. 20 లక్షల ఆర్థిక సాయం ప్రకటన
అమరావతి – తాను మనసు కలిగిన వ్యక్తినని మరోసారి నిరూపించుకున్నారు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి. తెనాలికి చెందిన యువతి గీతాంజలి ఆత్మహత్య చేసుకోవడంపై స్పందించారు. మంగళవారం ఆయన కీలక ప్రకటన చేశారు.
గీతాంజలి మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటన తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని ఆవేదన చెందారు. గీతాంజలి కుటుంబాన్ని తమ ప్రభుత్వం తప్పకుండా ఆదుకుంటుందని స్పష్టం చేశారు. ఈ మేరకు తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డిని ఆదేశించారు.
వెంటనే బాధితురాలి కుటుంబానికి రూ. 20 లక్షలు పరిహారం ఇవ్వాలని సూచించారు జగన్ మోహన్ రెడ్డి. ఆ కుటుంబంలో ఇంకా ఎవరైనా ఉంటే వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని పేర్కొన్నారు. ఎవరూ అధైర్య పడాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు.
సీఎం జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం పట్ల పలువురు సంతోషం వ్యక్తం చేశారు.