గెలిచేది మేమే అధికారం మాదే
నిప్పులు చెరిగిన సీఎం జగన్ రెడ్డి
విశాఖపట్టణం – రాబోయే ఎన్నికల్లో మరోసారి ఫ్యాన్ గాలికి ప్రతిపక్షాలు కొట్టుకు పోవడం పక్కా అని జోష్యం చెప్పారు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి. మంగళవారం విశాఖలో జరిగిన సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఆరు నూరైనా సరే సూర్యుడు పడమట ఉదయించినా సరే తాము విజయం సాధించడం ఖాయమని జోష్యం చెప్పారు.
తాము సర్వేలను నమ్ముకోవడం లేదన్నారు. ప్రజలను నమ్ముకున్నామని, తాము అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే తమను గట్టెక్కిస్తాయని జోష్యం చెప్పారు. ప్రజలకు ఏం కావాలో నిరంతరం పని చేస్తున్న ఏకైక సీఎంను తానేనని స్పష్టం చేశారు.
పార్టీ అన్నాక ఇబ్బందులు అనేవి ఉంటాయని, ఎన్నికల తర్వాత విశాఖ నుంచే ఏపీ పాలన సాగుతుందన్నారు జగన్ మోహన్ రెడ్డి. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు. చంద్రబాబు నాయుడు,పవన్ కళ్యాణ్ పగటి కలలు కంటున్నారని, ఆ ఇద్దరికీ ఏడ్వడటం తప్ప ప్రజా సమస్యలు పట్టవన్నారు.
గత ఎన్నికల్లో ప్రజలు అడ్రస్ లేకుండా చేశారని , ఈసారి కూడా అదే రిపీట్ కాబోతోందంటూ పేర్కొన్నారు ఏపీ సీఎం.