NEWSANDHRA PRADESH

సంక్షేమం విజ‌యానికి సోపానం

Share it with your family & friends

వై నాట్ 175 అన్న‌ది నిజం

బాప‌ట్ల జిల్లా – ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మ‌రోసారి తాము చేప‌ట్టిన సంక్షేమ కార్య‌క్ర‌మాలే త‌మ‌ను అధికారంలోకి తీసుకు వ‌చ్చేలా చేస్తాయ‌ని స్ప‌ష్టం చేశారు. శ‌నివారం ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా ఆయ‌న ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్బంగా మేమంతా సిద్దం బ‌స్సు యాత్ర‌లో భాగంగా త‌న‌ను ఆద‌రిస్తున్న ప్ర‌తి ఒక్క‌రికీ ధ‌న్య‌వాదాలు తెలిపారు.

గ‌తంలో ఏలిన వారు ప్ర‌జ‌ల బాగోగుల గురించి ప‌ట్టించు కోలేద‌ని ఆరోపించారు. కానీ తాము వ‌చ్చాక అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల అభ్యున్న‌తి కోసం పాటు ప‌డ్డామ‌ని చెప్పారు. ఇవాళ దేశంలో ఎక్క‌డా లేని రీతిలో న‌వ రత్నాలు అమ‌లు చేస్తున్నామ‌న్నారు జ‌గ‌న్ రెడ్డి.

అంతే కాదు తాము అమ‌లు చేస్తున్న వాలంటీర్ల వ్య‌వ‌స్థ దేశానికే ఆద‌ర్శ ప్రాయంగా నిలిచింద‌న్నారు. దీని నిర్వ‌హ‌ణ గురించి కేంద్రం సైతం కితాబు ఇచ్చింద‌ని ఈ విష‌యం గురించి మ‌రోసారి గుర్తు చేశారు ఏపీ సీఎం. ఇక టీడీపీ కూట‌మి అబ‌ద్దాల‌ను ఎక్కువ‌గా ప్ర‌చారం చేస్తోంద‌న్నారు. వారి మాట‌ల‌ను మీరు న‌మ్మ వ‌ద్ద‌ని కోరారు.

మ‌రోసారి తాను ప్ర‌జ‌లంద‌రి సాక్షిగా ప్ర‌మాణ స్వీకారం చేస్తాన‌ని, జ‌న రంజ‌క పాల‌న‌ను అంద‌జేస్తాన‌ని హామీ ఇచ్చారు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి.