స్పష్టం చేసిన ఏపీ సీఎం జగన్
అమరావతి – ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తన గెలుపు నల్లేరు మీద నడకేనని స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు. తనపై లేని పోని ఆరోపణలు, విమర్శలు చేస్తున్న వాళ్లకు ఒక్కటే సమాధానం జూన్ 4 తర్వాత వెలువడే ఫలితాలేనని అన్నారు.
ఇదిలా ఉండగా జగన్ మోహన్ రెడ్డి మీడియాతో సంభాషించారు. తాము ధనవంతులకు , పేదలకు మధ్య జరుగుతున్న యుద్దంగా తాను ఎప్పుడూ చెప్ప లేదని స్పష్టం చేశారు జగన్ మోహన్ రెడ్డి. కానీ పెత్తందారులకు పేదలకు మధ్య పోటీ జరుగుతోందని మాత్రం తాను పదే పదే చెబుతూ వస్తున్నానని , ఈ మాటకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నానని అన్నారు సీఎం.
తాను ఆరోపించిన వాళ్లంతా ప్రభుత్వ బడులలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెట్టడాన్ని వ్యతిరేకించారని గుర్తు చేశారు. కానీ తాను వచ్చాక విద్యా రంగాన్ని, ఆరోగ్య రంగాన్ని ప్రజల చెంతకు తీసుకు వెళ్లానని చెప్పారు. అంతే కాకుండా వ్యవసాయం దండుగ అన్న చంద్రబాబు కు షాక్ ఇచ్చేలా పండుగలా చేశానని స్పష్టం చేశారు జగన్ మోహన్ రెడ్డి.