వివేకా హత్యపై జగన్ కామెంట్స్
హంతకుడికి చెల్లెళ్ల మద్దతు
అమరావతి – ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన బాబాయి వివేకానంద రెడ్డి దారుణ హత్యపై తొలిసారిగా నోరు విప్పారు. బుధవారం యుద్దానికి సిద్దం పేరుతో ఆయన ప్రజా యాత్రకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా కీలక వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది.
గత కొన్ని రోజులుగా వివేకానంద రెడ్డి హత్యపై తీవ్రమైన ఆరోపణలు, విమర్శలు ఎదుర్కొంటున్నారు. దీనిపై విచారణ కొనసాగుతోంది. ఎవరు హంతకులు అనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. ఎంపీ అవినాష్ రెడ్డిని సీబీఐ విచారణ చేపట్టింది.
ఇదే క్రమంలో ఇవాళ తన సోదరీమణులు ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి, వివేకానంద రెడ్డి కూతురు డాక్టర్ సునీతా రెడ్డిలపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను బద్నాం చేసేందుకు ప్రయత్నం చేయడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు.
వైఎస్ వివేకానంద రెడ్డిని హత్య చేసింది ఎవరో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసన్నారు. హంతకుడికి తన ఇద్దరు చెల్లెళ్లు మద్దతు ఇస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు జగన్ మోహన్ రెడ్డి.