బాబు అనుకుంటే జగన్ చావడు
ఏపీ సీఎం సంచలన కామెంట్స్
అమరావతి – ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం బొబ్బిలో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా టీడీపీ చీఫ్ , మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడును ఏకి పారేశారు. తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గురించి చంద్రబాబు నాయుడు చులకన చేసి మాట్లాడారని అన్నారు. ఆనాడు అసెంబ్లీ సాక్షిగా వైఎస్ గాల్లోనే కలిసి పోతాడని అన్నది నిజం కాదా అని ప్రశ్నించారు.
చంద్రబాబు అన్న మాటలను తాను ఎన్నటికీ మరిచి పోలేనన్నారు. ఆనాడు తన తండ్రిని ఇవాళ తనను కూడా ఉద్దేశించి దిగజారుడు కామెంట్స్ చేశారని ధ్వజమెత్తారు జగన్ మోహన్ రెడ్డి. తనను ప్రజా క్షేత్రంలో ధైర్యంగా ఎదుర్కోలేక ఇలాంటి చవకబారు వ్యాఖ్యలు చేస్తున్నాడని మండిపడ్డారు. దమ్మున్నోడు అయితే ప్రత్యక్షంగా పోరాడాలని , ప్రజా క్షేత్రంలో తేల్చు కోవాలని అన్నారు.
చంద్రబాబు వ్యాఖ్యలు ఆయన నేర ప్రవృత్తికి నిదర్శనం అని అన్నారు సీఎం. జగన్ రెడ్డిని చంపేస్తే తప్పేంటి అని చంద్రబాబు అంటున్నాడని , ఆయన అనుకుంటే జగన్ చని పోడన్నారు. జగన్ ను ప్రజలే కాపాడుకుంటారని , దేవుడు రక్షించు కుంటాడని చెప్పారు.