బాబు నిర్వాకం జగన్ ఆగ్రహం
ఏపీ సీఎం వైఎస్ జగన్ రెడ్డి ఫైర్
అమరావతి – ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో ఎన్నికలు సక్రమంగా జరుగుతాయనే నమ్మకం రోజు రోజుకీ సన్నగిల్లుతోందన్నారు. మంగళవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
ఇష్టానుసారంగా అధికారులను మార్చేస్తున్నారని ఆరోపించారు. పేదలకి మంచి జరగకుండా దుర్మార్గంగా చంద్రబాబు అడ్డు పడుతున్నాడని ఆరోపించారు. పేదలకి మంచి చేస్తున్న మీ జగన్ ఉండ కూడదని కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు .
రాష్ట్రంలో ఏ ఒక్క రైతు అయినా తమ భూమిని లాగేసుకున్నారని నీకు చెప్పారా చంద్రబాబూ అని ప్రశ్నించారు జగన్ రెడ్డి. ఇదే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ మంచిదని మీ పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో పొగిడాడని, .కావాలంటే అసెంబ్లీ రికార్డులు చూసుకోవాలని సవాల్ విసిరారు.
వాలంటీర్లు మళ్లీ మీ ఇంటికే రావాలన్నా, పేదవాడి భవిష్యత్తు మారాలన్నా, పథకాలన్నీ కొనసాగాలన్నా, లంచాలు, వివక్ష లేని పాలన జరగాలన్నా, మన పిల్లలు వారి చదువులు, బడులు బాగుపడాలన్నా, రాష్ట్రంలో వైద్యం, వ్యవసాయం మెరుగుపడాలన్నా మీరందరూ ఫ్యాన్ గుర్తు మీద రెండు బటన్లు నొక్కాలని పిలుపునిచ్చారు ఏపీ సీఎం.